ఈ ప్రాంతం వారికి గుడ్ న్యూస్.. ఈ నెల 17న కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు..

దిశ, బేగంపేట: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రజల నిరీక్షణకు ఈ నెల 17వ తేదిన తెరపడనుంది. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బండ మైసమ్మ నగర్‌లో 27.2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, CC నగర్‌లో 20.46 కోట్ల రూపాయల వ్యయంతో […]

Update: 2021-12-08 09:41 GMT

దిశ, బేగంపేట: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రజల నిరీక్షణకు ఈ నెల 17వ తేదిన తెరపడనుంది. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బండ మైసమ్మ నగర్‌లో 27.2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, CC నగర్‌లో 20.46 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 264 ఇండ్లను ఈ నెల17వ తేదీన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని తెలిపారు. ఇండ్ల కేటాయింపు‌లో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా లబ్ధిదారులతో రెవెన్యూ, హౌసింగ్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి అర్హులను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.

పేద ప్రజలు సరైన సౌకర్యాలు, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుర్తించారన్నారు. పేద ప్రజలు అన్ని సౌకర్యాల‌తో తమ సొంత ఇంటిలో సంతోషంగా, ఆత్మగౌరవం‌తో బ్రతకాలన్నదే కేసీఆర్ ఉద్దేశం అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ లేదు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News