రైతు భరోసా ఇచ్చినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా!.. జగదీష్ రెడ్డి సవాల్

ఇప్పటికీ వరకు రాష్ట్రంలో 65 లక్షల మందికీ ఐదు భరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్తాయిలో మండిపడ్డారు.

Update: 2024-05-05 06:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పటికీ వరకు రాష్ట్రంలో 65 లక్షల మందికీ ఐదు భరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. అది నిజమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ పాలన చేస్తున్నాడని, అలాగే ఖమ్మం సభలో మరొక అబద్దం చెప్పాడని అన్నారు. రేవంత్ కొనసాగించింది కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బంధు మాత్రమేననీ రైతు భరోసా కాదన్నారు.

రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ముక్కుకు నేలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు. 65 లక్షల మంది రైతులకు ఇచ్చింది రైతు భరోసా కాదు రైతు బంధు మాత్రమేనని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన పథకాన్నే కొనసాగించారు తప్పా, రైతు భరోసా ఇవ్వలేదన్నారు. మోడీ రైతు చట్టాలను వెనక్కి తీసుకొని చెంపలు వేసుకున్న విధంగానే, ఐదు నెలలుగా ఆలస్యంచేసినందుకు, రైతులందరికీ రైతుబంధు ఇచ్చి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలయ్యారని, రైతు బంధు అనేది తెలంగాణ రైతుల హక్కు అన్న జగదీష్ రెడ్డి.. రైతు భరోసా అని సీఎం మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. 

Similar News