డిస్నీ ప్లస్ ఒరిజినల్స్ .. డైరెక్ట్‌గా థియేటర్స్‌లో రిలీజ్?

దిశ, సినిమా : ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘డిస్నీ+’ 100 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌కు రీచ్ అయింది. డిస్నీ షేర్ హోల్డర్స్ మీటింగ్‌ తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సీఈఓ బాబ్ చెపక్ .. ఈ సందర్భంగా మరిన్ని మేజర్ అనౌన్స్‌మెంట్స్ చేశారు. డిస్నీ+ ప్రారంభించిన 15 నెలల్లోనే 100 మిలియన్ మార్క్‌ రీచ్ కావడం ఆనందంగా ఉందని, వినియోగదారుల కోసం ప్రతీ ఏడాది 100 కొత్త ప్రోగ్రామ్‌లు/సిరీస్‌లు/ ఒరిజినల్ ఫిల్మ్స్ తీసుకొచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇక మోస్ట్ […]

Update: 2021-03-10 01:45 GMT

దిశ, సినిమా : ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘డిస్నీ+’ 100 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌కు రీచ్ అయింది. డిస్నీ షేర్ హోల్డర్స్ మీటింగ్‌ తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సీఈఓ బాబ్ చెపక్ .. ఈ సందర్భంగా మరిన్ని మేజర్ అనౌన్స్‌మెంట్స్ చేశారు. డిస్నీ+ ప్రారంభించిన 15 నెలల్లోనే 100 మిలియన్ మార్క్‌ రీచ్ కావడం ఆనందంగా ఉందని, వినియోగదారుల కోసం ప్రతీ ఏడాది 100 కొత్త ప్రోగ్రామ్‌లు/సిరీస్‌లు/ ఒరిజినల్ ఫిల్మ్స్ తీసుకొచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇక మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘బ్లాక్ విడో’ మే7న డైరెక్ట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుందని, అయితే థియేటర్ రిలీజ్ స్కిప్ చేస్తూ డిస్నీ ప్లస్‌లో డైరెక్టర్ రిలీజ్ చేసే ప్లాన్స్ లేవని స్పష్టం చేశారు సీఈఓ. కాగా డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్‌లోని అవెంజర్స్ క్యాంపస్ 2021 ఎండింగ్‌లో రీఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News