భారీగా బంగారం పట్టివేత

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రా-తమిళనాడుకు చెందిన ఐదుగురిని ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వందేభారత్ మిషన్ ద్వారా దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన వారి నుంచి రూ.1.85 కోట్లు విలువజేసే 3.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారానికి సంబంధించి వారివద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం వారిపై కేసు నమోదు […]

Update: 2020-11-10 09:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రా-తమిళనాడుకు చెందిన ఐదుగురిని ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వందేభారత్ మిషన్ ద్వారా దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన వారి నుంచి రూ.1.85 కోట్లు విలువజేసే 3.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారానికి సంబంధించి వారివద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News