ప్రధాని మోడీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్

దిశ, నేషనల్ బ్యూరో : గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్‌తో చెన్నై నగరంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కార్యాలయం బుధవారం రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది.

Update: 2024-05-23 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్‌తో చెన్నై నగరంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కార్యాలయం బుధవారం రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్‌లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక చేసిన వెంటనే సదరు వ్యక్తి కాల్‌ను కట్ చేశాడు. ఆ వెంటనే ఎన్‌ఐఏ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్‌కు సమాచారాన్ని చేరవేశారు. వారు విచారణ చేపట్టి కాల్ వివరాలను విశ్లేషించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని కాలర్ మధ్యప్రదేశ్‌లోని ఏ లొకేషన్‌ నుంచి కాల్ చేశాడు ? అతడు ఏ సిమ్ కార్డును వాడాడు ? అనేది గుర్తించడంపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కాగా, వాంటెడ్ క్రిమినల్స్​ను పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్స్​ను ప్రకటించింది. వాటిలోనే ఓ నంబరుకు ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం గమనార్హం. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల​ను​ చంపుతానంటూ ఓ ఆగంతకుడి నుంచి ఉత్తర​ప్రదేశ్‌లోని​ నోయిడాలో ఉన్న ఒక మీడియా సంస్థకు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానిపై అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Tags:    

Similar News