వినూత్నం, విప్లవాత్మకమైనది ‘ధరణి’

దిశ, వెబ్‌డెస్క్: ‘ధరణి’ పోర్టల్ వినూత్నం, విప్లవాత్మకమైనదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం కలెక్టర్లు, తహసీల్దార్లుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధరణి పై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈనెల 25న సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఇది పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలవడంతో పాటు ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ధరణి అమలుకు తహసీల్దార్లు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, […]

Update: 2020-10-17 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ధరణి’ పోర్టల్ వినూత్నం, విప్లవాత్మకమైనదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం కలెక్టర్లు, తహసీల్దార్లుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధరణి పై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈనెల 25న సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఇది పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలవడంతో పాటు ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ధరణి అమలుకు తహసీల్దార్లు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ధరణి కోసం పూర్తి స్థాయి హార్డ్‌వేర్ సదుపాయాలు కల్పించాలన్నారు.

Tags:    

Similar News