‘మోడీపై జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్‌లో తప్పేముంది’

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదంటూ హేమంత్‌కు జగన్ సూచించారు. దీంతో జగన్ ట్వీట్‌పై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్‌లో తప్పేముంది అని ప్రశ్నించారు. మోడీ, జగన్‌‌లు ఏకపక్ష విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. దేశంలో కరోనా పరిస్థితులు చేజారడానికి ప్రధాని మోడీ విధానాలే […]

Update: 2021-05-07 20:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదంటూ హేమంత్‌కు జగన్ సూచించారు. దీంతో జగన్ ట్వీట్‌పై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్‌లో తప్పేముంది అని ప్రశ్నించారు. మోడీ, జగన్‌‌లు ఏకపక్ష విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. దేశంలో కరోనా పరిస్థితులు చేజారడానికి ప్రధాని మోడీ విధానాలే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ చేసేది కరోనాపై యుద్ధం కాదు.. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే ప్రధాని మోడీని జగన్ బలపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. కరోనాపై జగన్ ఇప్పటివరకూ ఒక్క అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

Tags:    

Similar News