ఏపీలో 5లక్షలకు చేరువలో కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. వరుసగా 11వరోజు 10వేలకు పైగా కేసులు వచ్చాయి. గడిచిన 24గంటల్లో 72,573 మందికి పరీక్షలు నిర్వహించగా 10,794మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. 70మంది మృతి చెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,417గా ఉంది. తాజాగా 11,915మంది కరోనా నుంచి కోలుకున్నారు. 99,689 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స […]

Update: 2020-09-06 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు వేల సంఖ్యలో పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. వరుసగా 11వరోజు 10వేలకు పైగా కేసులు వచ్చాయి. గడిచిన 24గంటల్లో 72,573 మందికి పరీక్షలు నిర్వహించగా 10,794మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. 70మంది మృతి చెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,417గా ఉంది. తాజాగా 11,915మంది కరోనా నుంచి కోలుకున్నారు. 99,689 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 3,91,124మంది డిశ్చార్జ్ అయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో 9మంది ప్రాణాలు కోల్పోగా అనంతపురంలో 8మంది, గుంటూరులో 8మంది, ప్రకాశంలో 8మంది, కడపలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కర్నూలులో నలుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.

అనంతపురం జిల్లాలో 753 కరోనా పాజిటివ్ కేసులు రాగా, చిత్తూరులో 927, తూర్పు గోదావరిలో 1,244, గుంటూరులో 703, కడపలో 904, కృష్ణాలో 457, కర్నూలు 380, నెల్లూరు 1,299, ప్రకాశం 1,042, శ్రీకాకుళం 818, విశాఖపట్నం 573, విజయనగరం 593, పశ్చిమగోదావరిలో 1,101 కేసులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 41లక్షల 7వేల 890మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News