కలుషితమవుతున్న మిషన్ భగీరథ నీరు

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అమ్రాబాద్ మండల కేంద్రంలో గత పది రోజులుగా మద్ది మడుగు ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది. దాన్ని మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే మరమ్మతులు చేయుటకు గోతులు తీసి వదిలి ఉండడంతో మంచినీరు కలుషితం అవుతున్నాయని, తద్వారా రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని […]

Update: 2021-12-03 02:09 GMT

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అమ్రాబాద్ మండల కేంద్రంలో గత పది రోజులుగా మద్ది మడుగు ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది. దాన్ని మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే మరమ్మతులు చేయుటకు గోతులు తీసి వదిలి ఉండడంతో మంచినీరు కలుషితం అవుతున్నాయని, తద్వారా రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని గ్రామస్తులు మండిపడుతున్నారు. నిత్యం వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయని, తద్వారా దోమల వ్యాప్తి అధికమవుతుందని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని అమ్రాబాద్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News