గొల్ల కురుమలకు,ముదిరాజుల సంక్షేమానికి, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : వంశీచందర్ రెడ్డి

మక్తల్ లో ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ముదిరాజుల

Update: 2024-05-05 10:32 GMT

దిశ,మక్తల్: మక్తల్ లో ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి హజరైయ్యారు. వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజుల కు గొల్ల కురుమల సంక్షేమానికి, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని,ముదిరాజ్ కులాన్ని బీసీ డీ గ్రూప్ నుండి ఏ గ్రూపులోకి గొల్ల కురుమలకు ఎస్సీ గ్రూప్ లో కి మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.

పాలమూరులో ముదిరాజుల మద్దతుతో మద్దతుతో ఎంపీగా తాను గెలవబోతున్నానని అన్నారు. సారా వ్యాపారం, అక్రమ క్రషర్ ,అక్రమ కల్లు దందాలతో కోట్లకు పడగలెత్తిన ప్రత్యర్థుల ముందు సామాన్య రైతు కుటుంబానికి చెందిన తాను ఎన్నికల్లో గెలుస్తానా లేదన్న చిన్న అనుమానం ఉండిందని ముదిరాజుల మద్దతుతో వందకు వంద శాతం తాను ఎంపీగా గెలవడం ఖాయం అయిపోయిందన్న ఆత్మవిశ్వాసం ఇవాళ తనకు కలిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో సబ్సిడీపై గొర్రెలు ఇస్తామని డీడీలు కట్టించుకొని చేతులెత్తేసిందని, కట్టిన డబ్బులు ఇప్పించేందుకు డీడీలు కట్టిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ పైసలు ఇప్పించే బాధ్యత తను తీసుకుంటానని వంశీచందర్ రెడ్డి సంఘాల వారికి హామీ ఇచ్చారు. సంక్షేమానికి ముదిరాజుల. గొల్ల కురుమల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని ఈ రెండు కులాల వారు అధికంగా ఉన్న పాలమూరు జిల్లాలో వారికి అందుబాటులో తీసుకురాకుండా ఈ ప్రాంతం నుంచి ఎంపికైన ఎంపీలు న నిర్లక్ష్యం చేశారని అన్నారు.

Similar News