మిత్రుత్వాన్ని చెరిపేస్తున్నారు : రాహుల్

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్డీఏ ప్రభుత్వం పొరుగుదేశాలతో ఉన్న మిత్రుత్వాన్ని శత్రుత్వంగా మారుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ హయాంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించామని, ప్రధాని మోదీ మాత్రం వాటిని చెరిపేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. పొరుగు దేశాలతో స్నేహితంగా ఉండకపోతే చాలా ప్రమాదమని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. ”అనేక దశాబ్దాలుగా పొరుగు దేశాలతో కాంగ్రెస్ పోషించిన సంబంధాలను మోదీ నాశనం చేస్తున్నారు. పొరుగు దేశాలతో మిత్రుత్వం లేకపోవడం చాలా అపాయకరం” అంటూ ట్విట్టర్ […]

Update: 2020-09-23 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఎన్డీఏ ప్రభుత్వం పొరుగుదేశాలతో ఉన్న మిత్రుత్వాన్ని శత్రుత్వంగా మారుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ హయాంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించామని, ప్రధాని మోదీ మాత్రం వాటిని చెరిపేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

పొరుగు దేశాలతో స్నేహితంగా ఉండకపోతే చాలా ప్రమాదమని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. ”అనేక దశాబ్దాలుగా పొరుగు దేశాలతో కాంగ్రెస్ పోషించిన సంబంధాలను మోదీ నాశనం చేస్తున్నారు. పొరుగు దేశాలతో మిత్రుత్వం లేకపోవడం చాలా అపాయకరం” అంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News