కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రాజీనామా?

దిశ, వెబ్‌డెస్క్ : పుదుచ్చేరి శాసనసభలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఆయన మరికొద్ది సేపట్లో సీఎం పదవికి రాజీమానా చేయనున్నారు. 33 మంది శాసనసభ్యులతో సహ ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ఉన్న పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్‌ బలనిరూపణలో సమయంలో బలహీనపడింది. వరుసగా ఎమ్మెల్యేల రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ బలం 26 మందికి పడిపోయింది. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. […]

Update: 2021-02-22 01:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పుదుచ్చేరి శాసనసభలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. దీంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఆయన మరికొద్ది సేపట్లో సీఎం పదవికి రాజీమానా చేయనున్నారు.

33 మంది శాసనసభ్యులతో సహ ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు ఉన్న పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్‌ బలనిరూపణలో సమయంలో బలహీనపడింది. వరుసగా ఎమ్మెల్యేల రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ బలం 26 మందికి పడిపోయింది. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్‌ కూటమి బలం 12కి తగ్గింది. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 10(స్పీకర్‌తో కలిపి), డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి బలం 14(ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు)గా ఉంది. దీంతో బలం లేక సీఎం నారాయణ స్వామి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Tags:    

Similar News