పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పోలీసుల‌పై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్లో ప్రశంస‌ల జ‌ల్లు కురిపించారు. క‌రోనా క‌ష్టకాలంలోనూ విరామం లేకుండా ప‌ని చేస్తున్నార‌ని కొనియాడారు. క‌రోనా నివార‌ణ‌కు వినియోగించే మెడిసిన్, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను బ్లాక్ మార్కెటింగ్‌ చేస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటూ, పోలీసులు త‌మ వంతు కృషి చేస్తున్నార‌ని మంత్రి పేర్కొన్నారు. క‌రోనా సెకండ్ వేవ్‌లో క‌రోనా మెడిసిన్లను బ్లాక్‌లో అమ్ముతున్న వారిపై 128 కేసులు న‌మోదు చేయడంతోపాటు, 258 మందిని అదుపులోకి […]

Update: 2021-05-20 06:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పోలీసుల‌పై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్లో ప్రశంస‌ల జ‌ల్లు కురిపించారు. క‌రోనా క‌ష్టకాలంలోనూ విరామం లేకుండా ప‌ని చేస్తున్నార‌ని కొనియాడారు. క‌రోనా నివార‌ణ‌కు వినియోగించే మెడిసిన్, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను బ్లాక్ మార్కెటింగ్‌ చేస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటూ, పోలీసులు త‌మ వంతు కృషి చేస్తున్నార‌ని మంత్రి పేర్కొన్నారు.

క‌రోనా సెకండ్ వేవ్‌లో క‌రోనా మెడిసిన్లను బ్లాక్‌లో అమ్ముతున్న వారిపై 128 కేసులు న‌మోదు చేయడంతోపాటు, 258 మందిని అదుపులోకి తీసుకున్నార‌ని కేటీఆర్ తెలిపారు. బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్న వారిపై 100 డయల్ చేసి ఫిర్యాదు చేయాల‌ని, లేకుంటే డీజీపీకి ట్వీట్టర్ ద్వారా చేయాల‌ని మంత్రి సూచించారు.

Tags:    

Similar News