‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి’

దిశ, నల్లగొండ: జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నల్లగొండ జెడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. మునుగోడు మండలంలోని కోతులారం, పలివెల, ఇప్పర్తి కచలాపురం గ్రామాల్లోని డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపిడీవో సునీత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెరుకు కృష్ణయ్య, టీఆర్ఎస్ […]

Update: 2020-05-06 02:00 GMT

దిశ, నల్లగొండ: జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నల్లగొండ జెడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. మునుగోడు మండలంలోని కోతులారం, పలివెల, ఇప్పర్తి కచలాపురం గ్రామాల్లోని డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపిడీవో సునీత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెరుకు కృష్ణయ్య, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు దాడి శ్రీనివాస్ రెడ్డి, కోతులరం సర్పంచ్ జాజుల పారిజాత, తదితరులు పాల్గొన్నారు.

Tags: NRGES, nallagonda zdp ceo, visit, dumping yard, ts news

Tags:    

Similar News