BRS నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డ కేటీఆర్..!

బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్ అరెస్ట్ అయ్యాడు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ట్ స్టేషన్‌లో నమోదైన కేసు

Update: 2024-05-01 17:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్ అరెస్ట్ అయ్యాడు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు మేరకు అతడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో క్రిశాంక్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. క్రిషాంక్ అరెస్టు.. అక్రమం.. అన్యాయం.. దుర్మార్గమని విమర్శించారు. క్రిశాంక్ అంటే ఒక ఉద్యమ గొంతుక.. ఒక చైతన్య ప్రతీక.. యువతరానికి ప్రతిబింబమన్నారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై.. ఢిల్లీ బీజేపీ అరాచకాలపై.. గళమెత్తినందుకే ఈ దౌర్జన్యం.. ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు.. మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ నియంతృత్వ.. నిర్బంధాలకు.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. నాడు ఎమర్జెన్సీ చూశాం..నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్-బీజేపీలకు పట్టడం ఖాయం.. తథ్యమని అన్నారు. 

Similar News