కమిషనర్ కన్నెర్ర.. కానిస్టేబుళ్లకు ఫైన్

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. నిబంధలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. కానీ పోలీసులే ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తే ఎలా అంటున్నారు వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి. పోలీసు స్టేషన్ల తనిఖీలో భాగంగా వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆయన.. స్టేషన్‌లోని ఫైళ్లను తనిఖీ చేశారు. అనంతరం పరిసరాలను పరిశీలించి వివిధ కేసుల్లో స్టేషన్ ఆవరణలో ఉన్న […]

Update: 2021-09-14 05:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. నిబంధలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. కానీ పోలీసులే ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తే ఎలా అంటున్నారు వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి. పోలీసు స్టేషన్ల తనిఖీలో భాగంగా వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆయన.. స్టేషన్‌లోని ఫైళ్లను తనిఖీ చేశారు. అనంతరం పరిసరాలను పరిశీలించి వివిధ కేసుల్లో స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాల వివరాలు తెలుసుకున్నారు. అయితే ఆ వాహనాల్లో కానిస్టేబుళ్లవి ఉండడంతో ఆయన అవాక్కు అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లే్ట్స్ ఉండటం, హెల్మెట్ లేకుండానే కానిస్టేబుళ్లు స్టేషన్‌కు రావడాన్ని గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ.. ప్రజలకు రూల్స్ చెప్పే మనమే పాటించకపోతే ఎలా అని మందలించారు. వారి వాహనాలపై ట్రాఫిక్ ఫైన్లు వేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News