సినారెకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాహితీ సౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవాప్తం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. దక్కనీ ఉర్డూ, తెలుగు బాషా సాహిత్యాలను జుగల్బందీ చేసి, గజల్స్‌తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్‌ కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. దేశీయ అంతర్జాతీయ భాషల్లో తెలుగు […]

Update: 2021-06-12 02:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాహితీ సౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవాప్తం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. దక్కనీ ఉర్డూ, తెలుగు బాషా సాహిత్యాలను జుగల్బందీ చేసి, గజల్స్‌తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్‌ కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. దేశీయ అంతర్జాతీయ భాషల్లో తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరం అని కేసీఆర్ కొనియాడారు. భాష, సాహిత్యం నిలిచివున్నన్నాళ్లూ ప్రజల హృదయాల్లో సినారె నిలిచివుంటారని కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News