ఏకలవ్య ఎగిరిపోనున్నదా..?

దిశ, భద్రాచలం : చర్ల కేంద్రంగా మంజూరైన ఏకలవ్య పాఠశాల ఇతర ప్రాంతానికి తరలిపోనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఏకలవ్య పాఠశాల కోసం చర్లలో రెవెన్యూ అధికారులు ముందుగా కేటాయించిన స్థలంపై గిరిజనులు కోర్టుకు వెళ్ళిస్టే తెచ్చుకున్నారు. దాంతో చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని ఆనుకొని కొంత స్థలాన్ని ఏకలవ్యకి ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. ఈ విషయం తెలిసి కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు కలిసి అభ్యంతరం చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. చర్లలో ఏకలవ్యకి స్థలం కేటాయించడం రెవెన్యూ […]

Update: 2021-10-30 01:25 GMT

దిశ, భద్రాచలం : చర్ల కేంద్రంగా మంజూరైన ఏకలవ్య పాఠశాల ఇతర ప్రాంతానికి తరలిపోనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఏకలవ్య పాఠశాల కోసం చర్లలో రెవెన్యూ అధికారులు ముందుగా కేటాయించిన స్థలంపై గిరిజనులు కోర్టుకు వెళ్ళిస్టే తెచ్చుకున్నారు. దాంతో చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని ఆనుకొని కొంత స్థలాన్ని ఏకలవ్యకి ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. ఈ విషయం తెలిసి కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు కలిసి అభ్యంతరం చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు.

చర్లలో ఏకలవ్యకి స్థలం కేటాయించడం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా తయారై చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎంచక్కా చర్లకి మంజూరైన ఏకలవ్యని మహబూబాబాద్ తరలించుకపోవడానికి ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది కార్యరూపం దాల్చితే ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు జనం ముందు దోషులుగా నిలబడక తప్పదు. ఇప్పటికైనా అందరు ఒక్కత్రాటిపైకి వచ్చి ఏకలవ్య ఎక్కడికి పోకుండా అడ్డుపడాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News