రూ. 436 తో రూ. 2 లక్షల విలువైన ప్రమాద బీమా కవరేజ్

దేశంలోని అల్పాదాయ ప్రజలను ప్రమాదాల సమయంలో ఆర్ధికంగా ఆదుకోడానికి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. దీని పేరు ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJB)’.

Update: 2022-12-06 17:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అల్పాదాయ ప్రజలను ప్రమాదాల సమయంలో ఆర్ధికంగా ఆదుకోడానికి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. దీని పేరు 'ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJB)'. 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిలో సంవత్సరానికి రూ. 436 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 2 లక్షల విలువైన ప్రమాద బీమా కవరేజీ పొందవచ్చు. ఆదాయం తక్కువ, పేద, అట్టడుగు వర్గాల వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ద్వారా అందిస్తుంది. ఈ పాలసీలో భాగంగా బీమా కలిగిన వ్యక్తి మరణిస్తే రూ. 2 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. అలాగే ప్రమాదవశాత్తు అంగవైకల్యం ఏర్పడితే రూ. లక్ష వరకు లభిస్తాయి.

ఈ పాలసీలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ప్రతి ఏడాది బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు ఆటో డెబిట్ చేయబడుతాయి. దీనికి వినియోగదారులు, బ్యాంక్ అనుమతి తప్పనిసరి. ఈ పథకంలో చేరిన తర్వాత పాలసీ దారుని వయస్సు 55 ఏళ్లు వచ్చినప్పుడు పథకం క్యాన్సల్ అవుతుంది. దీనిలో జాయింట్ ఖాతాలు కూడా తీసుకోవచ్చు. కానీ వార్షిక ప్రీమియం చెల్లింపులు మాత్రం విడి విడిగా చేయాలి. పూర్తి వివరాల కోసం దగ్గరలోని ఎల్ఐసీ శాఖలో సంప్రదించగలరు.

Similar News