పాతబస్తీలో హిందువుల ఓట్లు తొలగించారు :బండి

దిశ, వెబ్‎డెస్క్: పాతబస్తీలో హిందువుల ఓట్లు తొలగించారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బేగంపేటలో ఆదివారం డాక్టర్లతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి సంజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, ఛత్రినాక వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడ పోయారని అడిగారు. వారి ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. […]

Update: 2020-11-29 00:36 GMT

దిశ, వెబ్‎డెస్క్: పాతబస్తీలో హిందువుల ఓట్లు తొలగించారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బేగంపేటలో ఆదివారం డాక్టర్లతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి సంజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, ఛత్రినాక వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడ పోయారని అడిగారు. వారి ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని స్పష్టం చేశారు. బీజేపీ గెలిస్తే రోహింగ్యాలు, పాక్‌ వాసులను తరిమికొడతామన్నారు. ఎన్నో మహానగరాలను బీజేపీ అభివృద్ధి చేసిందని, హైదరాబాద్‌ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News