వైసీపీ నేత రామచంద్రా రెడ్డి రెస్టారెంట్‌లో సోదాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

ఎన్టీఆర్ జిల్లాలో ZPTCగా వైసీపీ నేత రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-05-26 05:17 GMT

దిశ వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లాలో ZPTCగా వైసీపీ నేత రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈయన ఎన్టీఆర్ జిల్లాలో రెస్టారెంట్‌‌ను సైతం నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా రామచంద్రా రెడ్డి రెస్టారెంట్‌లో అధికారులు సోధాలు నిర్వహించారు. ఈ సోధాల్లో నిబంధనలకు విరుద్దంగా జూదం ఆడుతున్న జూదప్రియులను అధికారులు పట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో రెస్టారెంట్‌లో జూదం ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే నిందితుల నుంచి రూ.30 వేల నగదు, 12 బైకులను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కాగా రెస్టారెంట్ యజమాని రామచంద్రారెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Similar News