బతుకమ్మ పండుగ స్పెషల్ : పిండి వంటల తయారీ విధానం..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగకు తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు. అంతే కాకుండా బంగారు గౌరమ్మకు ఎంతో ఇష్టమైన పిండి వంటలు.. సత్తులు, మలి ముద్దలు చేసి నైవేద్యంగా పెడుతారు. ఆ పిండి వంటలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే వీటిని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. జొన్న సత్తుపిండి తయారీ విధానం.. కావాల్సిన పదార్థాలు.. జొన్నలు అరకప్పు, బెల్లం 1/3 […]

Update: 2021-10-10 22:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగకు తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు. అంతే కాకుండా బంగారు గౌరమ్మకు ఎంతో ఇష్టమైన పిండి వంటలు.. సత్తులు, మలి ముద్దలు చేసి నైవేద్యంగా పెడుతారు. ఆ పిండి వంటలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే వీటిని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం.

జొన్న సత్తుపిండి తయారీ విధానం..

కావాల్సిన పదార్థాలు..

  • జొన్నలు అరకప్పు,
  • బెల్లం 1/3 కప్పు

తయారీ విధానం : ఒక బౌల్ తీసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టి బౌల్ వేడి అయ్యాక అందులో జొన్నలు వేసి వేయించాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేగిస్తే జొన్నలు పేలాలు అవుతాయి. వాటిని మిక్సర్‌లో వేసి పొడిలా చేయాలి. పొడి అయిన తర్వాత కొంచెం బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టాలి. దీంతో జొన్న సత్తుపిండి రెడీ. ఈ సత్తుపిండిని ముద్దలుగా చేసుకొని తింటే ఇక ఆ రుచే వేరు ఉంటది.

నువ్వుల సత్తుపిండి తయారీ విధానం..

కావాల్సిన పదార్థాలు..

  • నువ్వులు ఒక కప్పు
  • యాలకులు- మూడు
  • బెల్లం : 1/3 కప్పు

తయారీ విధానం : ఒక బౌల్ తీసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టి బౌల్ వేడి అయ్యాక అందులో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగాక వాటిని చల్లార బెట్టాలి. తర్వాత నువ్వులు, యాలకులు మిక్సీలో వేసి మెత్తటి పొడి చేయాలి. తర్వాత మరోసారి బెల్లం వేసి మిక్సీ పట్టాలి. దీంతో నువ్వుల పిండి రెడీ.

Tags:    

Similar News