బతుకమ్మ చీరలను తగలబెట్టిన మహిళలు..

దిశ నాగర్‌కర్నూల్ : తెలంగాణ ప్రభుత్వం దసరా నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆడపడుచులకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకం గా ఉన్నాయని పాత చీరలు మాదిరి చిరిగి పోతున్నాయని ఇలాంటి నాసిరకమైన బతుకమ్మ చీరలు మాకొద్దు అంటూ మహిళలంతా చీరలను పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రెండు వందలు పెట్టి బయట మార్కెట్లో కొన్న చీర నాణ్యతగా ఉందని […]

Update: 2021-10-10 04:31 GMT

దిశ నాగర్‌కర్నూల్ : తెలంగాణ ప్రభుత్వం దసరా నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆడపడుచులకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకం గా ఉన్నాయని పాత చీరలు మాదిరి చిరిగి పోతున్నాయని ఇలాంటి నాసిరకమైన బతుకమ్మ చీరలు మాకొద్దు అంటూ మహిళలంతా చీరలను పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రెండు వందలు పెట్టి బయట మార్కెట్లో కొన్న చీర నాణ్యతగా ఉందని వేలు ఖర్చుచేసి మహిళ ఆత్మగౌరవం నిలబెడుతున్నాం అంటూ పంపిణీ చేస్తున్న చీరలు నాసిరకంగా ఉన్నాయని మండిపడ్డారు. దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేయడం సిగ్గుగా లేదా అని మహిళలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News