బంగ్లా ఆర్మీ క్యాంప్ లో భారత్ జవాన్లు.. ఏకంగా 123 మంది..

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ పీచమణిచి అర్ధశతాబ్దం పూర్తి అయింది. బంగ్లాకు బాసటగా జరిగిన యుద్దంలో బంగ్లాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇరుదేశాల మధ్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తి కావడంతో మన  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాకు వెళ్లారు. బంగ్లా సైనికులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. పరేడ్ లో గౌరవవందనం స్వీకరించిన ఆయనకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్వాగతం పలికారు. భారత్ కు చెందిన 123 మంది […]

Update: 2021-12-16 08:15 GMT

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ పీచమణిచి అర్ధశతాబ్దం పూర్తి అయింది. బంగ్లాకు బాసటగా జరిగిన యుద్దంలో బంగ్లాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇరుదేశాల మధ్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తి కావడంతో మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాకు వెళ్లారు. బంగ్లా సైనికులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు.

పరేడ్ లో గౌరవవందనం స్వీకరించిన ఆయనకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్వాగతం పలికారు. భారత్ కు చెందిన 123 మంది తివిధ దళాల బృందం ఈ పరేడ్ లో పాల్గొన్నారు. 1971 లో జరిగి పాక్-బంగ్లా యుద్దంలో భారత్ ఎంతో సహాయం చేసింది. దాంతో ఉత్తర దక్షిణ పాకిస్తాన్ లు గా ఉన్న దాయాది దేశం రెండు ముక్కలుగా మారింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం ఈ రోజును స్వతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటోంది.

Tags:    

Similar News