అతి‌పెద్ద ప్రజాస్వామ్య పండుగ.. ఎన్నికలు వీక్షించేందుకు అంతర్జాతీయ సందర్శకులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను వీక్షించేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబీఎస్) నుంచి 75 మంది అంతర్జాతీయ సందర్శకులను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించింది.

Update: 2024-05-04 08:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను వీక్షించేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబీఎస్) నుంచి 75 మంది అంతర్జాతీయ సందర్శకులను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తోందని పేర్కొంది. మే 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం భారతదేశ ఎన్నికల వ్యవస్థ సూక్ష్మ నైపుణ్యాలతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉపయోగించే ఉత్తమ పద్ధతులను విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు (ఈఎంబీఎస్) పరిచయం చేయడానికి ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది.

భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, మోల్డోవా, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు, పాపువా న్యూ గినియా, నమీబియా నుంచి ప్రతినిధులు రానున్నారు. ఈ దేశాలతో పాటు, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ (ఐఎఫ్‌ఈఎస్) సభ్యులు, భూటాన్, ఇజ్రాయెల్ నుంచి మీడియా బృందాలు కూడా పాల్గొంటాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్‌లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు మే 5 న ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Tags:    

Similar News