రూ.40 కోట్ల ఫ్రాడ్.. ఐదుగురు జీఎస్టీ అధికారులు అరెస్ట్

ఐదుగురు జీఎస్టీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.

Update: 2024-05-04 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐదుగురు జీఎస్టీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. జీఎస్టీ మోసం చేసిన కేసులో ఐదుగురు జీఎస్టీ అధికారులు అరెస్ట్ అయ్యారు. ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ ఉన్నట్లు సృష్టించి నిందితులు జీఎస్టీ రీఫండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులతో కలిసి జీఎస్టీ అధికారులు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.40 కోట్లు వ్యాపారులతో కలిసి జీఎస్టీ అధికారులు కాజేశారు. అరెస్ట్ అయిన వారిలో నల్గొండ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ స్వర్ణ కుమార్, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్లు వేణుగోపాల్, విశ్వకిరణ్, మహిత ఉన్నారు. వీరితో డిప్యూటీ స్టేట్ జీఎస్టీ కమిషనర్ వెంకటరమణను సైతం సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలో నలుగురు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News