నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

దిశ, వెబ్‌డెస్క్ : మార్చి 15న ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈనెల 18న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. ఇన్ని రోజులు శాఖల వారీగా పద్దులపై చర్చ జరిగింది. చివరి రోజైన శుక్రవారం శాసనసభ, శాసన మండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మొదట ప్రశ్నోత్తరాలను చేపడుతారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు. దానికి ప్రభుత్వం […]

Update: 2021-03-25 21:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మార్చి 15న ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈనెల 18న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. ఇన్ని రోజులు శాఖల వారీగా పద్దులపై చర్చ జరిగింది. చివరి రోజైన శుక్రవారం శాసనసభ, శాసన మండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మొదట ప్రశ్నోత్తరాలను చేపడుతారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు. దానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. దీంతోపాటు ఇవాళ అసెంబ్లీకి కాగ్‌ నివేదిక సమర్పించనుంది. చర్చలు, ఆమోదం అనంతరం శాసనమండలి, శాసనసభ నిరవధికంగా వాయిదా పడనున్నాయి.

Tags:    

Similar News