పారామెడికల్ కోర్సులకు ప్రవేశాలు.. దరఖాస్తు చేసుకోండిలా..

దిశ సూర్యాపేట కలెక్టరేట్: ప్రైవేట్ పారా మెడికల్ 2021-22 విద్యా సంవత్సరానికి డి.ఎం.పి.హెచ్.ఏ (ఎం), డి.ఎం.ఎల్.టి., డి.ఓ.ఏ, డి.ఆర్.జి.ఏ, కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 03-12-2021 లోగా తమ దరఖాస్తులు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము సూర్యాపేట నందు సమర్పించాలని, డీఎం హెచ్ ఓ కోటాచలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సాయిచంద్ర పారమెడికల్ ఇన్స్టిట్యూట్, సూర్యాపేట సాయి తేజ పారమెడికల్ ఇన్స్టిట్యూట్, సూర్యాపేట శ్రీవాణి పారమెడికల్ […]

Update: 2021-11-25 05:31 GMT

దిశ సూర్యాపేట కలెక్టరేట్: ప్రైవేట్ పారా మెడికల్ 2021-22 విద్యా సంవత్సరానికి డి.ఎం.పి.హెచ్.ఏ (ఎం), డి.ఎం.ఎల్.టి., డి.ఓ.ఏ, డి.ఆర్.జి.ఏ, కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 03-12-2021 లోగా తమ దరఖాస్తులు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము సూర్యాపేట నందు సమర్పించాలని, డీఎం హెచ్ ఓ కోటాచలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని సాయిచంద్ర పారమెడికల్ ఇన్స్టిట్యూట్, సూర్యాపేట సాయి తేజ పారమెడికల్ ఇన్స్టిట్యూట్, సూర్యాపేట శ్రీవాణి పారమెడికల్ ఇన్స్టిట్యూట్, సూర్యాపేట చందన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారమెడికల్ సైన్స్ సూర్యాపేట, లక్ష్మి పారమెడికల్ ఇన్స్టిట్యూట్ సూర్యాపేట, పవన్ ఎం‌పి‌హెచ్‌ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సూర్యాపేట, సంధ్యా పారమెడికల్ ఇన్స్టిట్యూట్ సూర్యాపేట, శ్రీ చందన ఎం‌పి‌హెచ్‌ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సూర్యాపేట, వినాయక పారమెడికల్ ఇన్స్టిట్యూట్ సూర్యాపేట, సాహితీ పారా మెడికల్ ఇన్స్టిట్యూట్ సూర్యాపేట, వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎం‌పి‌హెచ్‌ఏ (ఎం), లలో ఈ కోర్సుల ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

ఇతర వివరాల కోసం 9133334720 కార్యాలయ నంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమని, దరఖాస్తు ఫారంను www.tspmb.telangana.gov.in నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.

Tags:    

Similar News