ఆసక్తికరంగా ఏపీ పోలీసుల కొత్త కార్యక్రమం

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే ఆ సందర్భాలు అరుదు. అయితే ప్రస్తుతం మన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ముస్కాన్. ఈ ఆపరేషన్ లో భాగంగా అనాథ బాలబాలికలను, తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చి కొందరు గమ్యం తెలియని అనాథ జీవితం గడుపుతున్నవారిని రాష్ట్ర వ్యాప్తంగా […]

Update: 2020-07-13 22:14 GMT

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే ఆ సందర్భాలు అరుదు. అయితే ప్రస్తుతం మన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ముస్కాన్. ఈ ఆపరేషన్ లో భాగంగా అనాథ బాలబాలికలను, తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చి కొందరు గమ్యం తెలియని అనాథ జీవితం గడుపుతున్నవారిని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పబ్లిక్ ప్లేసుల్లో గుర్తించనున్నారు. నేటి నుంచి ఈ ఆపరేషన్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News