పోలీస్‌ అధికారులు 24గంటలు విధుల్లో ఉండాలి

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులందరూ 24గంటల పాటు విధుల్లో ఉండాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని.. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించడంలో పోలీసుశాఖ చొరవ ప్రశంసనీయమని డీజీపీ కొనియాడారు. కలెక్టర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయంతో పని చేయడం అభినందనీయమన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు డయల్ 100, 112 సేవలను వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు.

Update: 2020-10-13 10:12 GMT

Tags:    

Similar News