భారత విపణిలోకి సామ్‌సంగ్ నుండి మరో ఫోన్.. ఫీచర్స్ అదుర్స్…

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ భారత విపణిలోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌కు చెందిన ఎం 32ను ఇండియా మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీని ఫీచర్స్..6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో పాటు, అమోలెడ్ డిస్‌ప్లే, రిఫ్రేష్ రేటు 90 Hz, హై బ్రైట్‌నెస్ గరిష్టంగా 800 నిట్లు, 48MP క్వాడ్ కెమెరా, 6000 mAH బ్యాటరీ సామర్థ్యం […]

Update: 2021-06-12 01:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ భారత విపణిలోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌కు చెందిన ఎం 32ను ఇండియా మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీని ఫీచర్స్..6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో పాటు, అమోలెడ్ డిస్‌ప్లే, రిఫ్రేష్ రేటు 90 Hz, హై బ్రైట్‌నెస్ గరిష్టంగా 800 నిట్లు, 48MP క్వాడ్ కెమెరా, 6000 mAH బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాదు ఈ మొబైల్‌ 5G నెట్‌వర్క్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ను అమెజాన్, సామ్‌సంగ్.కామ్ లతో పాటు ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో కొనుకోవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News