Konaseema: నర్సింగ్‌ విద్యార్థినిని మేడపై నుంచి కిందకు నెట్టేసిన స్నేహితులు

తమ బిడ్డలు బుద్ధిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు...

Update: 2023-03-18 11:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమ బిడ్డలు బుద్ధిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. తమ వద్ద ఉంటే గారాబం వారిని ఎక్కడ చెడగొట్టేస్తుందన్న భయంతో హాస్టల్‌లో ఉంచి మరీ చదివిస్తుంటారు. అలా హాస్టల్‌లో అందరితో కలిసి చదువుకోవాల్సిన విద్యార్థినిలు క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బులు పోయినవనో, వస్తువులు కనిపించడంలేదనో కారణం చూపించి దాడులకు పాల్పడుతున్నారు.

ఇలాంటి ఘటనే ఒకటి డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరంలోని వైవీఎస్ అండ్ బీఆర్ఎస్ఎం నర్సింగ్ కాలేజీలో జరిగింది. కాలేజీ హాస్టల్‌లో ఏడుగురు విద్యార్థినులు ఉంటున్నారు. అయితే వారిలో ఒకరివి డబ్బులు కనిపించకుండా పోయాయి. దీంతో విద్యార్థునుల మధ్య గొడవ జరిగింది. అందరూ వారి వారి బ్యాగులను చెక్ చేసుకున్నారు. అయితే పోయిన డబ్బులు కనిపించలేదు. అదే రూమ్‌లో నర్సింగ్ ఫస్టియర్ విద్యార్థిని పల్లవి(19) ఉంటున్నారు. ఆమె రెండో అంతస్థులో ఉన్న సమయంలో వెనుక నుంచి కొందరు విద్యార్థినిలు కిందకు నెట్టేశారు. దీంతో  విద్యార్థినిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా కాలు, చేయితో పాటు మూడు చోట్ల ఎముకలు విరిగినట్లు తేలింది. స్నానం చేసి బయట ఉండగా తనను కిందకు తోసేశారని బాధితురాలు పల్లవి ఆరోపించారు. అయితే ఎవరు తోశారో తాను చూడలేదని తెలిపారు. 

Tags:    

Similar News