సీఎం జగన్‌పై బాలయ్య పంచ్‌లు..మామూలుగా లేవుగా..!

సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్‌లు వేశారు..

Update: 2024-04-26 13:15 GMT

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కందుకురు నియోజవకర్గంలో టీడీపీ అభ్యర్థుల తరపున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన పంచులు వేశారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారన్నారు. మడమ తిప్పమంటూ మెడలు విరిశారు. తన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటూనే రాష్ట్రాన్ని కాష్టంలా మార్చేశారని మండిపడ్డారు. మద్య పాన నిషేధం అని చెప్పి పేదల రక్తాన్ని పీల్చేశారని ఆరోపించారు. జగనన్ననంటూ జలగలా పీడిస్తున్నారని ఎద్దేవా చేశారు. మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టాడని సీఎం జగన్‌పై పంచులు విసిరారు. అవ్వా, తాతల నోటి దగ్గర బువ్వలాగేసుకున్నారని వ్యాఖ్యానించారు. నవరత్రాల పేరుతో నడుములు కుంగదీశారని సెటైర్లు వేశారు. నేనున్నంటూ కూరత్రం, దుర్మార్గం, మోసపూరితంగా వ్యవహరించారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More...

ఇంతలా దిగజారుతావా.. జగన్‌పై TDP సంచలన ట్వీట్ 

Tags:    

Similar News