Janmabhoomi Express: అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

అనకాపల్లి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు..

Update: 2023-06-07 10:36 GMT

దిశ, ఉత్తరాంధ్ర: అనకాపల్లి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ప్రయాణికులు రైలు ఎక్కుతున్న క్రమంలో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రమాదవశాత్తు ముగ్గురు ప్లాట్ ఫారంపై జారిపడ్డారు. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో అల్లం శంకరరావు, అన్నపూర్ణ, జనపరెడ్డి ద్రాక్షాయనిగా గుర్తించారు. ప్రమాద సమాచారంతో క్షతగాత్రులను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Tags:    

Similar News