అల్లూరి జిల్లాలో భారీ డంప్.. భగ్నం చేసిన పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల అలజడి రేగింది

Update: 2024-05-25 09:12 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల అలజడి రేగింది. పనసలబంద అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. మాయిస్టుల భారీ డంప్‌ను గుర్తించారు. భద్రతా బలగాలే లక్ష్యంగా డంపు చేసినట్లు గుర్తించారు. ఆరు మందుపాతరులు, రెండు మైన్స్‌తో పాటు మేకులు, 150 మీటర్ల వైర్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో 13 మంది మాయిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నారని వారి ఫొటోలను విడుదల చేశారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటువారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మావోయిస్టుల చర్యల నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు జన జీవన స్రవంతి కలిసిపోవాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని పోలీసులు తెలిపారు. 

Similar News