Go Back Cm Jagan sir.. విశాఖలో ఒక్కసారిగా కలకలం

జూలైలో విశాఖ నుంచే పాలనకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు...

Update: 2023-03-17 10:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జూలైలో విశాఖ నుంచే పాలనకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ఇప్పటికే ప్రకటించిన సీఎం జగన్ ఇక విశాఖ నుంచే పాలన అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికార యంత్రాంగం అంతా పరిపాలనకు సంబంధించి కార్యాలయాలకోసం వెతుకులాట ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇలాంటి తరుణంలో ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అంటూ విశాఖలో పోస్టర్లు వెలియడం ఒక్కసారిగా కలకలం రేపాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, జగదాంబ, మద్దిలపాలెం, సిరిపురం, ఆశిల్‌మెట్ట కూడళ్లతోపాటు ముఖ్యమైన కూడళ్లలో ‘జన జాగరణ సమితి’ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఈ ఫ్లెక్సీలు ప్రత్యక్షమవ్వడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నుంచే పాలన మొదలు పెడతామని సీఎం జగన్ ప్రకటించిన తర్వాత అందుకు విరుద్ధంగా పోస్టర్లు వెలియడంతో వైసీపీ నేతలు మండిపడ్డారు.

మరోవైపు ఏయూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ ప్రశాంతతకు భంగం కలిగించేలా పోస్టర్లను ఏర్పాటు చేశారంటూ విరుచుకుపడ్డారు. ఈ పోస్టర్ల ఏర్పాటు వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలంటూ మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు. మరోవైపు వైసీపీ నాయకత్వం సైతం ఆ పోస్టర్లు ఎవరు వేశారో తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పోస్టర్లు వెలియడం వెనుక ఉన్నవారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: MP అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్  

Tags:    

Similar News