Visakha: సీఎం జగన్ ఫ్లెక్సీ చించివేత

పాడేరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్లెక్సీ‌లను ఆదివాసి గిరిజనులు తగలబెట్టారు....

Update: 2023-03-26 11:33 GMT

దిశ, పాడేరు: పాడేరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్లెక్సీ‌లను ఆదివాసి గిరిజనులు తగలబెట్టారు. మరికొన్ని ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. వైసీపీ పార్టీని నమ్మి రెండు దఫాల ఓటు వేసిన గిరిజనులు మోసపోయారంటూ నినాదాలు చేశారు. ఈ వ్యతిరేకత ప్రభుత్వంపైనా లేదా స్థానిక ఎమ్మెల్యే మీద అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. నిరసనకారులు ఏ పార్టీకి సంబంధించిన వారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ విధ్వంసం అంత సీసీ కెమెరాలు రికార్డు అయింది. అయితే ఇదంతా అర్ధరాత్రి సమయంలో జరిగింది. పోలీసులు సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News