Breaking News: వైసీపీకి బిగ్‌షాక్.. కీలక నేత రాజీనామా..

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

Update: 2024-04-13 08:13 GMT

అమలాపురం దిశ ఏప్రిల్ 13 : అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పులపర్తి నారాయణమూర్తి పై కొండేటి చిట్టిబాబు పోటీ  చేసి ఓటమిపాలయ్యారు.

 

కాగా 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నేలపూడి స్టాలిన్ తో తలపడి గెలుపొందారు. కాగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ పి గన్నవరం బరిలో దిగేందుకు వైసీపీ నుండి టికెట్ ఆశించిన చిట్టిబాబుకు నిరాశే మిగిలింది. ఇక ఇటీవల మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి వైసీపీలో చేరడంతో రగులుతున్న అగ్నిలో అర్జ్యం పోసినట్లయింది.

ఆమె రాకను వైసీపీ స్వాగతించడం, తనకి టికెట్ ఇవ్వకపోవడంతో చిట్టిబాబు అసహనానికి గురైయ్యారు. పార్టీకి గుడ్ బై చెప్పేసారు. ఈ రోజు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పి గన్నవరం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి. వైసీపీ ఓట్ బ్యాంకును కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News