Ap News: సేవల్లో సచివాలయాలు సరికొత్త రికార్డు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల నుంచి తొలిసారి జనవరి 25వ తేది 2.88 లక్షల వినతులు పరిష్కరించడం ద్వారా ఈ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించిదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ..

Update: 2023-01-29 16:23 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల నుంచి తొలిసారి జనవరి 25వ తేదీన 2.88 లక్షల వినతులు పరిష్కరించడం ద్వారా ఈ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించిదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గ్రామ,వార్డు సచివాయాల ఏర్పాటు అయిన తరువాత మూడేళ్లలో సొంత ఊళ్లలోనే ప్రజలు మొత్తం 6.43 కోట్ల సేవలను పొందారని చెప్పారు. వీటిలో రెవెన్యూ సంబంధిత సేవలను ప్రజలు అత్యధికంగా పొందారని అన్నారు.


సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి పేద ఇంటి తలుపు తడుతుందని చెప్పారు. నేరుగా 1.82 లక్షల కోట్లు రుపాయలు ప్రజల ఖాతాల్లోకి బదిలి అయ్యిందని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయితీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలో ఏపీ పోలీసులు మొదటి స్థానంలో నిలవడంపై ఆ శాఖను విజయసాయిరెడ్డి అభినందించారు.


Similar News