సుర్రుమంటున్న సూరీడు.. రికార్డు స్థాయికి నిమ్మకాయ ధరలు

ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి...

Update: 2024-04-26 16:00 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వస్తే మాడు సుర్రుమంటోంది. ఉదయం పది దాటిందంటే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఎండవేడిమిని తట్టుకునేందుకు మంచినీళ్లు, ఓఆర్ఎస్, నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారు. దీంతో రాష్ట్రంలో నిమ్మకాయ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మార్కెట్లో కూడా ఎప్పుడూ లేనంత ధరలు పలుకుతున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరులో బస్తా నిమ్మకాయలు ధరలు రూ.9,500 పలికింది. ఏప్రిల్ 22న నాలుగు వేలు పలికిన ధర గడిచిన నాలుగు రోజుల్లో రూ.9,500కు చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరని రైతులు చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో నిమ్మకాయల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

Similar News