మంత్రి కనబడటం లేదు..కలకలం రేపుతున్న పోస్టర్లు

ఎర్రగొండపాలెం లో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కనపడటం లేదంటూ వెలసిన పోస్టర్లు పై మంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది.

Update: 2024-03-10 15:07 GMT

దిశ, ఎర్రగొండపాలెం:ఎర్రగొండపాలెం లో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కనపడటం లేదంటూ వెలసిన పోస్టర్లు పై మంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. వైసీపీలోని ఒక వర్గం ఈ పోస్టర్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేయడాన్ని ఖండించింది. మంత్రి కనబడటం లేదని వైసీపీ వాళ్లు పోస్టర్లు వేయవలసిన అవసరం లేదని, మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా గత నాలుగున్నర ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.

కొండపి సమన్వయకర్తగా మంత్రి సురేష్ వెళ్లిన తర్వాత ఎర్రగొండపాలెం సమన్వయకర్తగా చంద్రశేఖర్ ను నియమించారని ఆయన వై.పాలెం లో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న చీప్ పాలిటిక్స్ అని తెలిపారు. కొండపి ప్రజలకు మంత్రి సురేష్ గురించి తప్పుడు ప్రచారం చేయాలంటే ఎర్రగొండపాలెం లో బురద చల్లాలనేది టీడీపీ కుట్ర అని పేర్కొన్నారు. కొండపిలో టిడిపి నాయకులు ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదని తెలిపారు. ఈ పోస్టర్ల వ్యవహారం తేలిన తర్వాత దీని వెనక ఎవరున్నారనేది కూడా ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు.

Similar News