ఒంగోలులో రెచ్చిపోయిన దొంగలు .. వృద్ధురాలిపై దారుణం

ప్రకాశం జిల్లా ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. ....

Update: 2024-05-24 10:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. అంబేద్కర్ భవన్ సమీపంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. వృద్ధురాలిపై దాడి చేసి 10 సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు. అయితే దొంగల చేతిలో గాయపడిన వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఒంగోలు పట్టణంలో అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆధారాలు లేకుండా బంగారం అమ్మేందుకు వస్తే వెంటనే తమకు తెలియజేయాలని వ్యాపారులకు సూచించారు. 

Similar News