AP News: టీడీపీ కీలక నేత కారును పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు

ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకుడి కారును అర్థరాత్రి దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు.

Update: 2024-05-25 06:06 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకుడి కారును అర్థరాత్రి దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయ కొండ మండలం, మూలగుంట పాలెంకి చెందిన చిగురుపాటి శేషగిరి టీడీపీ నాయకుడిగా పని చేస్తూనే లారీ అసోసియేషన్ అద్యక్షుడిగా బాధ్యలు నిర్వర్తిస్తున్నారు. కాగా తన  ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారును గుతర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.

ఇది గమనించిన శేషగిరి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలాని చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అలానే ఘటనపై కేసు  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనపై కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి స్పందిచారు. ఈ నేపథ్యంలో ఆయన ఎస్పీకి ఫోన్ చేసి రాజకీయ కోణంలోనూ దర్యాప్తు నిర్వహించాలని కోరినట్టు సమాచారం. 

Similar News