శ్వాస తీసుకో.. ప్యాకేజీ వద్దు.. Pawanకు అంబటి కౌంటర్

ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా అంటూ వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు....

Update: 2022-12-09 13:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా అంటూ వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. శ్వాస తీసుకో పవన్ కల్యాణ్... ప్యాకేజీ వద్దు అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

కాగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వాహనాన్ని సిద్ధం చేశారు. దానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. అయితే ఆ వాహనం ఆలివ్ గ్రీన్ రంగులో ఉండటంతో వివాదంగా మారింది. పవన్ వాహనం రంగు మిలిటరీ వాహనాలను పోలి ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు వేశారు. అంతేకాదు వాహనం రంగు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఇందుకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తనను శ్వాస అయినా తీసుకోనిస్తారా?, లేదా? అని ట్విటర్ వేదికగా పవన్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. 

Tags:    

Similar News