తిరుపతి కూటమి అభ్యర్థి వ్యతిరేకిస్తున్నాం: కిరణ్ రాయల్

తిరుపతి కూటమి అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నామని జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ అన్నారు...

Update: 2024-03-29 14:58 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి కూటమి అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నామని జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అభ్యర్థిత్వంపై కిరణ్ రాయల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరణి శ్రీనివాసులు తమకు సహకరించడంలేదని మండిపడ్డారు. సీనియర్లకు సీటు రాకపోవడం చాలా బాధగా ఉందని తెలిపారు. నామినేటెడ్ పోస్టు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు.

కాగా తిరుపతి సీటును జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ ఆశించారు. అయితే కూటమిలో భాగంగా ఆరణి శ్రీనివాసులు టికెట్ వెళ్లింది. దీంతో తిరుపతి జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. చిత్తురు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు కొద్ది రోజుల క్రితమే జనసేనలో చేరారు. దీంతో తిరుపతి సీటును శ్రీనివాసులకు కేటాయించారు. అయితే స్థానిక నేతలు మాత్రం ఆరణి అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తొలి నుంచి కూడా తిరుపతిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తమని కాదని ఆరణి శ్రీనివాసులకి సీటు ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆరణి మద్దతు ఇవ్వడం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరాలోచించాలని కోరుతున్నారు. 

Similar News