AP News:చంద్రగిరిలో భారీగా ఓటరు ఎపిక్ కార్డ్స్ గల్లంతు?

నియోజకవర్గంలో భారీగా ఓటరు ఎపిక్ కార్డ్స్ ( ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు) గల్లంతయ్యాయని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి ఆరోపించారు.

Update: 2024-04-28 13:02 GMT

దిశ,చంద్రగిరి: నియోజకవర్గంలో భారీగా ఓటరు ఎపిక్ కార్డ్స్ ( ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు) గల్లంతయ్యాయని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆమె కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలింగ్‌కు 14 రోజులే ఉన్నాయని చంద్రగిరిలో ఎపిక్ కార్డ్స్ చాలా వరకు ఓటర్లకు చేరలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అడ్రస్ దొరక్కపోవడంతో పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది బిఎల్ఓ కు అందజేసినట్లు తెలిసిందన్నారు.

మరి ఆ ఎపిక్ కార్డ్స్ బీఎల్వోల దగ్గర ఉన్నాయా? ఎమ్మార్వోల దగ్గర ఉన్నాయా? లేక ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాయా? తెలపాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. ప్రతి ఎఫిక్ కార్డు పంపిణీ వివరాలు కోరామన్నారు. 644 మాత్రమే వెనక్కి వచ్చాయని చెబుతున్నారు. కానీ వేల ఎపిక్ కార్డ్స్ వెనక్కి వచ్చాయని పులివర్తి సుధారెడ్డి అన్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రెండు రోజుల్లో వివరాలు ఇస్తామని చెప్పారని అన్నారు. దొంగ ఓట్లు పై పోరాటాలు చేయగా.. ప్రస్తుతం ఎమ్మెల్యే ఓటమి భయంతో కొత్త అడ్డదారులు వెతుక్కుంటూ ఉన్నారని ఆరోపించారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక కేంద్రాల్లో బందోబస్తు పెంచాలని కోరినట్లు తెలిపారు. నామినేషన్ రోజున ఆర్డీవో కార్యాలయం ఎదుట రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే మా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికే కలెక్టర్, ఈసీ లకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ను మరోసారి కోరడమైనదన్నారు.

Similar News