Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

తెలుగుదేశం పార్టీ అధినేత విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Update: 2023-09-26 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ సైతం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ రెండు పిటిషన్ల విచారణను బుధవారానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇప్పటి వరకు స్కిల్ స్కాం కేసును విచారించిన జడ్జి సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సత్యానందం ఇన్‌చార్జి జడ్జిగా వ్యవహరించారు. తమ పిటిషన్లపై తమ వాదనలను వినాలని చంద్రబాబు, సీఐడీ తరపు లాయర్లు జడ్ని కోరారు. అయితే ఈ ఒక్క రోజు వాదనలు విని తీర్పులు ఇవ్వడం కష్టమని జడ్జి తెలిపారు. బుధవారం నుంచి తాను సెలవుపై వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.రెగ్యులర్ కోర్టులో బుధవారం వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సైతం విచారణ వాయిదా పడింది. బుధవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 

Tags:    

Similar News