రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఎక్కువగా ఎక్కడ పోల్ అయ్యాయంటే..!

ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి...

Update: 2024-05-24 16:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13 ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 82 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. అయితే రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. తాజా లెక్కలు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 5,39,189 ఓట్లు నమోదు అయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 ఓట్లు రాగా తర్వాతి స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 ఓట్లు నమోదు అయ్యాయి. మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 ఓట్లు నమోదు అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని టీడీపీ కోరింది. దీంతో రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అంగీకరించారు. లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరింది. 

Similar News