మహిళా ఓటర్ల ముందే మాజీ మంత్రి బూతుల వర్షం.. నివ్వెరపోయిన అధికారులు

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర కొనసాగుతోంది.

Update: 2024-05-13 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఓటర్లందరూ భారీగా తమ తమ ఓటును వినియోగించుకుంటున్నారు. నగరం నుంచి జనాలంతా ఊరు బాట పట్టడంతో ఒక్కసారిగా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. వేసవి కాలం కావడంతో ప్రజలంతా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అరగంట ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాలన్నీ జనజాతరను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మహిళా ఓటర్ల ముందే బూతుల వర్షం కురిపించారు. అక్కడున్న ఎలక్షన్ అధికారులను బండ బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. చెప్పడానికి కూడా వీళ్లేని విధంగా అధికారులు తిట్లు విని నివ్వెరపోయారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఓటర్లు సైతం ఆ బూతులు విని అసహ్యించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Similar News