అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. అంటరానితనంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

దళితులను ఆకర్షించేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు...

Update: 2024-01-19 12:42 GMT

దిశ, వెబ్ డెస్క్: దళితులను ఆకర్షించేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. బడుగుల బలహీన వర్గాల ఆరాధ్యదైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కాసేపట్లో విజయవాడలో ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు సభలో అంటరానితనంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విధానాలు రూపం మార్చుకున్న అంటరానితనంగా అభివర్ణించారు. చంద్రబాబు పాలనా విధానం, ఆలోచనలు అంతరానితనమని సీఎం జగన్ ఆరోపించారు. పెత్తందారి తనాన్ని, అంటరాని తనాన్ని చంద్రబాబు ప్రోత్సహించినట్లుగా జగన్ వ్యాఖ్యానించారు. దళితులు, బీసీలంటే చంద్రబాబుకు ప్రేమ లేదనే ఆరోపణలు చేశారు. పెత్తందారి పార్టీ టీడీపీ అంటూ వ్యాఖ్యానించారు. అబేద్కర్ భావజాలం ఈ పెత్తందార్లకు నచ్చదన్నారు. తమ ప్రభుత్వానికి , గత ప్రభుత్వానికి చాలా తేడా ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంటే చంద్రబాబుకు నచ్చదన్నారు. అందుకే ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనే వ్యాఖ్యలు చంద్రబాబు చేశారని జగన్ తెలిపారు. తోకలు కత్తిరిస్తానంటూ బీసీలను సైతం చంద్రబాబు బెదిరించారని గుర్తు చేశారు. ఎస్సీలకు సంబంధించిన భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కూడా అంటరాని తనమేనని చెప్పారు. పేదలకు సంబంధించిన భూముల్లో కొందరు తమ కోటను నిర్మించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేయడానికి పేదల భూములు లాక్కున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి పెత్తందార్లకు కళ్లు తెరిపించేలా ఈ అంబేద్కర్ విగ్రహం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. 

Read More..

ఇప్పటి దాకా అమెరికా.. ఇక నుంచి విజయవాడ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు  

Tags:    

Similar News